PRO intro

☀️

సామెత

సామెతలు

గ్రంథకర్త

సామెతలు ప్రధాన రచయిత సొలొమోను. సొలొమోను పేరు 1:1; 10:1; 25:1 లో కనిపిస్తున్నది. ఇతర రచయితలు జ్ఞానులు అనే వర్గానికి చెందిన వివిధ వ్యక్తులు, అగూరు, లెమూయేలు రాజు. బైబిలు ఇతర గ్రంథాల వలె సామెతలు కూడా దేవుని రక్షణ ప్రణాళికను సూచిస్తున్నది. అయితే కొంత అస్పష్టంగా ఈ గ్రంథం ఇశ్రాయేలీయిలకు సరియైన జీవిత విధానం, దేవుని మార్గం అనుసరించవలసిందని సూచిస్తున్నది. సొలొమోను తన జీవిత కాలమంతా గడిచిన విజ్ఞానాన్ని గ్రంథస్థం చెయ్యమని దేవుడు అతణ్ణి ప్రేరేపించి ఉండవచ్చు.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 971 - 931

సొలొమోను పరిపాలన కాలంలో గ్రంథ రచన జరిగింది. ఈ సామెతలు అనేక వేల సంత్సరాల వాటివి. అయితే దైవజ్ఞానం ఏ కాలంలోనైనా ఏ సంసృతిలోనైనా వర్తిస్తుంది.

స్వీకర్త

సామెతలు గ్రంథం అనేక వర్గాల కోసం రాసినది. ఇది పిల్లల విషయంలో తల్లిదండ్రులకు సలహాలు ఇస్తుంది. జ్ఞానాన్ని అన్వేషించే యువతీయువకులకు ఇది అక్కరకు వస్తుంది. భక్తిగా ఉండగోరే నేటి బైబిలు పాఠకులకు ఇందులో ఆచరణాత్మకమైన సలహాలు ఉన్నాయి.

ప్రయోజనం

సామెతలు గ్రంథంలో సొలొమోను సాధారణ, దైనందిన పరిస్దితుల్లోను, ఉన్నత జ్ఞాన సంబంధిత విషయాల్లోనూ దేవుని మనస్సును వెల్లడించాడు. సోలొమోను రాజు ఏ అంశాన్నీ ఉపేక్షించలేదు. వ్యక్తిగత ప్రవర్తన, లైంగిక సంబధాలు, వ్యాపారం, సంపద, దానధర్మాలు, ఆశయాలు, క్రమశిక్షణ, అప్పులు, పిల్లలను పెంచడం, వ్యకిత్వం, మద్యపానం, రాజకీయాలు, పగ, దైవ భక్తి మొదలైన అనేక అంశాలు ఈ జ్ఞాన వాక్కుల సంకలనంలో చోటు చేసుకున్నాయి.

ముఖ్యాంశం

జ్ఞానం

విభాగాలు

1. జ్ఞానం యొక్క ఉత్తమాంశాలు — 1:1-9:18

2. సోలొమోను సామెతలు (అధ్యా. — 10:1-22:16)

3. జ్ఞానులు ఉవాచలు — 22:17-29:27

4. అగూరు మాటలు — 30:1-33

5. లెమూయేలు వాక్కులు — 31:1-31

Navigate to Verse