OBA intro

☀️

ఓబద్యా

ఓబద్యా

గ్రంథకర్త

ఓబద్యా అనే ప్రవక్త రాశాడు. ఇతని జీవిత చరిత్ర గురించి ఎలాటి సమాచారమూ లేదు. పొరుగు జాతి అయిన ఎదోముపై తీర్పు వినిపించడంలో ఓబద్యా యొరుషలేమును కేంద్రంగా చేయడాన్నిబట్టి ఇతడు యూదయ రాష్ట్రంలో పరిశుద్ద పట్టణ పరిసరాలకు చెందినవాడని భావించవచ్చు.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 840 - 586

యెరుషలేము పతనం జరిగిన కొద్ది కాలానికే ఓబద్యా రచన జరింగిందని భావించవచ్చు (వ. 11-14). అంటే బబులోను చెర కాలంలో.

స్వీకర్త

ఎదోము దాడి తరువాత కాలంలో యూదులు.

ప్రయోజనం

దేవునికి, ఇశ్రాయేల్ కు వ్యతిరేకంగా ఎదోము చేసిన పాపాలకు వ్యతిరేకంగా వారిపై తీర్పు ప్రకటించడానికి దేవుని ప్రవక్త ఓబద్యాను దేవుడు ఉపయెగించుకున్నాడు. ఎదోమీయిలు ఏశావు సంతతి. ఇశ్రాయేలీయిలు అతని కవల తమ్ముడు యాకోబు సంతతి. ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న విరోధం వాని ద్వారా వచ్చిన రెండు జాతులకు కూడా పాకింది. ఈ విరోధం వల్ల ఇశ్రాయేలీయిలు ఈజిప్టు నుండి తిరిగి వస్తున్నప్పుడు వారిని ఎదోమవారు తమ భూభాగం గుండా వెళ్ళనీయలేదు. ఎదోమీయిల గర్వం మూలంగా దేవుని నుండి తీవ్రమైన హెచ్చరిక అవసరం అయింది. దేవుని ప్రజలకు వారి భూమి తిరిగి స్వంతమై చివరి రోజుల్లో సీయోనుకు విముక్తి కలుగుతుందన్న వాగ్దానంతో పుస్తకం ముగుస్తుంది. దేవుడే వారిని పరిపాలిస్తాడు.

ముఖ్యాంశం

న్యాయ తీర్పు

విభాగాలు

1. ఎదోము నాశనం — 1:1-14

2. ఇశ్రాయేలు అంతిమ విజయం — 1:15-21

Navigate to Verse