JOL intro

☀️

యోవే

యోవేలు

గ్రంథకర్త

దీని గ్రంథకర్త యోవేలు అని గ్రంథమే చెబుతున్నది (1:1). ఈ పుస్తకంలో కనిపించే కొన్ని వివరాలు తప్ప ఈ ప్రవక్త గురించి మరేమీ మనకు తెలియదు. ఇతడు పెతూయేలు కుమారుడు. యూదా ప్రజలకు ప్రవచించాడు. యెరుషలేము పట్ల చాలా ఆసక్తి కనపరిచాడు. ఆలయం గురించీ, యాజకుల గురించి అనేక వ్యాఖ్యలు చేశాడు. యూదాలోని ఈ ఆరాధనా కేంద్రంలో ఇతనికి బాగా పరిచయం ఉన్నట్టు అర్ధమవుతున్నది.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 835 - 796

యోవేలు బహుశా పాత నిబంధన చరిత్రలో పారసీకుల కాలంలో జీవించాడు. ఆ కాలంలో పారసీకులు కొందరు యూదులను యెరుషలేముకు తిరిగి వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఆలయ నిర్మాణం జరిగింది. యోవేలుకు ఆలయం తెలుసు గనక, ఆలయం కట్టిన తరువాత కాలంలోనే అతడు ప్రవచనాలు చెప్పాడు.

స్వీకర్త

ఇశ్రాయేలు ప్రజలు, తరువాత కాలపు బైబిలు పఠతలంతా.

ప్రయోజనం

దేవుడు కరుణామయుడు కూడా, పశ్చాత్తాప పడిన వారందరినీ క్షమిస్తాడు. ఈ పుస్తకంలో రెండు ముఖ్య సంఘటనలు కనిపిస్తాయి. ఒకటి మిడతల దండు. రెండు ఆత్మ కుమ్మరింపు. దీని నెరవేర్పును అపొ. కా. 2 లో కనిపించే పెంతెకోస్తు సందర్బంలో పేతురు ప్రస్తావించాడు.

ముఖ్యాంశం

యెహోవా దినం

విభాగాలు

1. ఇశ్రాయేలు పై మిడతల దాడి — 1:1-20

2. దేవుని శిక్ష — 2:1-17

3. ఇశ్రాయేలుకు పూర్వక్షేమస్ధితి కలగడం — 2:18-32

4. తన ప్రజల మధ్య నివసించే ఇతర జాతుల పై దేవుని తీర్పు — 3:1-21

Navigate to Verse