DAN intro

☀️

దాని

దానియేలు

గ్రంథకర్త

రచయిత పేరు మీదగానే పుస్తకానికి పేరు వచ్చింది. ఇశ్రాయేలు నుండి బబులోనుకు ప్రవాసం వచ్చిన యూదుడుగా యెహెజ్కేలు అనుభవాలు ఇందులో ఉన్నాయి. “దానియేలు” అంటే “యోహోవా నా న్యాయాధిపతి.” అనేక భాగాల్లో దానియేల్ గ్రంథకర్త అనే సూచనలున్నాయి (9:2; 10:2). బబులోను ముఖ్య పట్టణంలో అతడు రాజు కొలువు కూటంలో ముఖ్యుడుగా ఉండడం వల్ల ఆ సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండే స్థితి అతనికి ఉంది. దీన్ని బట్టి బబులోను చెరలోని యూదుల కోసం తాను పలికిన ప్రవచనాలు అతడు గ్రంథస్థం చేశాడు. తనది కాని దేశంలో, నాగరికతలో అతడు తన ప్రభువుకు జరిగించిన నమ్మకమైన సేవ లేఖనాల్లో కనిపించే వారందరికంటే విశిష్టమైన వాడుగా అతణ్ణి నిలిపింది.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 605 - 535

స్వీకర్త

బబులోనులో యూదు ప్రవాసులు, తరువాతి బైబిలు పఠకులంతా.

ప్రయోజనం

దానియేలు ప్రవక్త చర్యలు, ప్రవచనాలు, దర్మనాలు ఈ పుస్తకంలో రాసి ఉన్నాయి. దేవుడు తనను అనుసరించే వాని పట్ల నమ్మకంగా ఉంటాడని ఈ పుస్తకం నేర్పిస్తున్నది. విశ్వాసులు తమ లోకవ్యవహారరాల్లో నిమగ్నమై ఉంటూనే దేవునికి నమ్మకంగా ఉండాలి.

ముఖ్యాంశం

దేవుని సార్వభౌమత్వం

విభాగాలు

1. గొప్ప విగ్రహం గురించి దానియేలు వివరాలు — 1:1-2:49

2. షడ్రకు, మెషెకు, అబెద్నెగోలు మండే అగ్నిగుండం నుంచి తప్పించుకోవడం — 3:1-30

3. నెబుకద్నెజరు కల — 4:1-37

4. కదిలే వేలు గోడపై రాత. వినాశనం గురించి దానియేలు ప్రవచనం — 5:1-31

5. సింహాల గుహలో దానియేలు — 6:1-28

6. నాలుగు మృగాల దర్శనం — 7:1-28

7. పొట్టేలు, మేకపోతు, చిన్నకొమ్ము దర్శనం — 8:1-27

8. 70 సంవత్సరాల గురించిన సమాచారంతో దానియేలు కలకు జవాబు — 9:1-27

9. దానియేలు దర్శనం, అంతిమ సమరం — 10:1-12:13

Navigate to Verse