అపొస్తలుల కార్యములు
అపోస్తలుల కార్యములు
గ్రంథకర్త
వైద్యుడు లూకా. అతడు ఈ పుస్తకంలో అనేక చోట్ల “మేము” అని రాసిన దాన్ని బట్టి ఇందులోని సంభవాలకు ఇతడు ప్రత్యక్ష సాక్షి అని తెలుస్తున్నది. (16:10-17; 20:5-21:18; 27:1-28:16). సాంప్రదాయికంగా ఇతన్ని యూదేతరుడని ఎంచారు. ముఖ్యంగా ఇతడు సువార్తికుడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 63 - 70
గ్రంథ రచన జరిగిన ముఖ్య ప్రదేశాలు యూదయ, సమరయ, యెరూషలేము, లుద్ద, యొప్పే, అంతియొకయ, ఈకొనియా, లుస్త్ర, దేర్బే, ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ, ఏతెన్సు, ఎఫెసు, సీజరియ, మెలితే, రోమ్.
స్వీకర్త
లూకా ఈ పుస్తకం తియోఫిలాకు రాశాడు. (1:1). ఈ తియోఫిలా ఎవరో సరిగా తెలియదు. బహుశా లూకాకు పెద్ద దిక్కుగా ఉన్న వాడు కావచ్చు. లేక ఈ పేరు (దీని అర్థం “దేవుణ్ణి ప్రేమించే వాడు”) విశ్వ వ్యాప్తంగా క్రైస్తవులందరినీ ఉద్దేశించి రాసి ఉండవచ్చు.
ప్రయోజనం
సంఘం ఆవిర్భావం, ఎదుగుదల, కథనాన్ని తెలపడం అపో. కా. గ్రంథం ఉద్దేశం. సువార్త గ్రంథాల్లో బాప్తిసమిచ్చే యోహాను, యేసు, అయన శిష్యులు ఆరంభించిన సందేశం ఇందులో కొనసాగుతుంది. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ రాకతో మొదలైన క్రైస్తవం వ్యాపించిన విధానం ఇందులో రాసి ఉంది.
ముఖ్యాంశం
సువార్త వ్యాప్తి.
విభాగాలు
1. పరిశుద్ధాత్మ వాగ్దానం — 1:1-26
2. పరిశుద్ధాత్మ వ్యక్తీకరణం — 2:1-4
3. జెరూసలేం లో పరిశుద్ధాత్మ చే ప్రారంభించబడిన అపొస్తలుల పరిచర్య, జెరూసలేం లో చర్చి యొక్క హింసను — 2:5-8:3
4. జుడియా, షోమరియా లో పరిశుద్ధాత్మ చే ప్రారంభించబడిన అపొస్తలుల పరిచర్య జుడియా, షోమరియా లో చర్చి యొక్క హింసను — 8:4-12:25
5. ప్రపంచం నలుదెసలా క్రైస్తవం వ్యాప్తి — 13:1-28:31