1 దిన
1 దినవృత్తాంతాలు
గ్రంథకర్త
1 దినవృత్తాంతములు గ్రంథంలో గ్రంథకర్తను పేర్కొనలేదు. యూదుల సంప్రాదాయ గాథ ప్రకారం ఎజ్ర శాస్త్రి ఈ గ్రంథం రాసాడు. ఇది ఇశ్రాయేల్ వంశాల జాబితాలో ఆరంభమవుతున్నది. ఐక్య ఇశ్రాయేల్ రాజ్యంపై దావీదు పరిపాలన వివరాలతో గ్రంథం కొనసాగి పాతనిబంధనలో ప్రసిద్దుడైన దావీదు గూర్చిన వివరాలను అందిస్తున్నది. ప్రాచీన ఇశ్రాయేల్ రాజకీయ మత చరిత్ర వివరాలు ఇందులో వున్నాయి.
రచనా కాలం, ప్రదేశం
సూమారు క్రీ. పూ. 450 - 425
ఇశ్రాయేలియులు బబులోను చెరనుండి తిరిగి వచ్చిన తరువాత గ్రంథం రచన జరిగిందన్నది స్పష్టం. 3:19-24 లో ఉన్న జాబితా దావీదు వంశం వృక్షం వరకు, జెరుబ్బాబెలు తరువాత ఆరు తరాలకు విస్తరించింది.
స్వీకర్త
ప్రాచీన యూదు ప్రజ. తరువాత ఉన్న బైబిల్ పాఠకులు.
ప్రయోజనం
బబులోను ప్రవాసం అనంతరం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని ఇశ్రాయేలీయిలకు నేర్పించడానికి ఈ గ్రంథరచన జరిగింది. దక్షిణ రాజ్య చరిత్రఫై పుస్తకం దృష్టి కేంద్రీకరించింది. అంటే యూదా బెన్యామిను, లేవీగోత్రాలు. ఈ గోత్రాలు తక్కిన గోత్రాల కన్నా దేవునిపట్ల మరింత విధేయంగా ఉన్నాయి. దేవుడు దావీదుతో తాను చేసిన నిబంధనకు కట్టుబడి దావీదు రాజ వంశాన్ని లేక పరిపాలనను అంతం లేని దాన్నిగా చేసాడు. ఇది మానవ మాత్రులైన రాజులకు సాధ్యం కాదు. దావీదు, సొలొమోనుల ద్వారా దేవుడు తన ఆలయాన్ని స్థాపించాడు. ప్రజలు అక్కడ ఆరాధనలు చేసేవారు. సొలొమోను దేవాలయాన్ని బబులోనులో వారు నాశనం చేసారు.
ముఖ్యాంశం
ఇశ్రాయేలు ఆధ్యాత్మిక చరిత్ర.
విభాగాలు
1. వంశావళలు — 1:1-9:44
2. సౌలు మరణం — 10:1-14
3. దావీదు అభిషేకం, రాజరికం — 11:1-29:30